calender_icon.png 9 September, 2025 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయ్యాలి

08-09-2025 08:40:47 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాలల్లో, తండాల్లో గత కొన్ని రోజుల నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని బిఆర్ఎస్ యూవ నాయకుడు నర్సాపూర్ మహేందర్ గౌడ్ తెలిపారు. సోమవారం ఈ సమస్యపై ఖేడ్ లోని మిషన్ భగీరథ డిఈ, ఏఈ లను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... వారానికి ఒక్కసారైనా మిషన్ భగీరథ నీరు రాకపోవడం బాధాకరమని అన్నారు. దూరప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకొనే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి నీటి సమస్య తీర్చాలని కోరారు.