calender_icon.png 9 September, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులకు క్రీడా పోటీలు

08-09-2025 08:33:15 PM

నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో పట్టణంలోని యన్‌టిఆర్ మినీ స్టేడియంలో జిల్లా ఉద్యోగుల కోసం వివిధ క్రీడా పోటీలు నిర్వహించబడ్డాయి. ఈ పోటీలలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. చెస్, క్యారమ్, టేబుల్ టెన్నిస్ వంటి ఇండోర్ గేమ్స్‌తో పాటు మరికొన్ని ఆటలు ఉత్సాహంగా సాగాయి. ప్రతి విభాగంలో పోటీదారులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ప్రతిభ కనబరిచారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, ఉద్యోగుల్లో శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం పెంపొందించడంలో క్రీడల ప్రాధాన్యత అమూల్యమని తెలిపారు. ఈ తరహా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించబడతాయని పేర్కొన్నారు.