calender_icon.png 9 September, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు

08-09-2025 08:29:57 PM

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): నల్గొండ పోలీసులు చట్టాన్ని అతిక్రమించి కాంగ్రెస్ పార్టీ వారికి కొమ్ముకాస్తూ, ఏకపక్షంగా బిఆర్ఎస్ కార్యకర్తలపై  అక్రమ  కేసులను పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టూ టౌన్ పోలీసులపై తీవ్రంగా విమర్శించారు. సోమవారం నల్గొండ డిఎస్పీకే శివరామిరెడ్డిని కలిసి మాట్లాడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆదివారం రాత్రి  గణేష్ నిమజ్జనం సందర్భంగా జరిగిన చిన్న గలాటా సందర్భంగా ఘర్షణ పడ్డ ఇరు వర్గాల వారు కూడా వారికి వారు సమదాయించుకొని వెళ్ళిపోగా టూ టౌన్ సిఐ, ఎస్ఐ నార్కట్పల్లి కి చెందిన  మట్టిపల్లి మణికంఠ ను బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి  బెదిరించి, వారిచేత రాత్రి 12 గంటల సమయంలో, టూ టౌన్ సిఐ ఎస్ఐ డిక్టేట్ చేస్తూ బలవంతంగా పిటిషన్ రాయించుకున్నారని పేర్కొన్నారు. నల్లగొండకు చెందిన బబ్లు, తదితరులపై కేసు పెట్టి వారిని రాత్రి నుండి టూ పోలీస్ స్టేషన్ లాకప్ లో పెట్టుకొని   వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, చిత్ర హింసలకు గురి చేస్తున్నారని అన్నారు.

  ఇందులో ఉన్న బబ్లు అన్న కాంగ్రెస్ పార్టీ అతనిని వెంటనే విడిచిపెట్టారని తెలిపారు. ఇదేమి విధానమని కాంగ్రెస్ పార్టీ నాయకుల మెప్పు కొరకు నల్గొండ టూ టౌన్ పోలీసులు వ్యవహరిస్తున్నారని అన్నారు. తక్షణమే అతనిని విడిచిపెట్టి, వారిపై పెట్టేసిన కేసును వెంటనే విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుల మెప్పు కొరకు నల్గొండ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

శుక్రవారం  జరిగిన ఒకటో నెంబర్ గణేష్ నిమజ్జోత్సవ కార్యక్రమంలో కూడా టూ టౌన్ సిఐ మితిమీరి ప్రవర్తించారని, తను విగ్రహ దాతగా వారి ఆహ్వానం మేరకు తాను అక్కడికి వెళితే తనను లోనికి వెళ్ళకుండా అడ్డుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇలాంటి పోలీసుల వల్ల డిపార్ట్మెంట్ చెడు పేరు రావడమే కాకుండా  ప్రశాంతంగా ఉన్న నలగొండ పట్టణంలోగొడవల సృష్టికి మూలం అవుతున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు వీరిపై వెంటనే, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేకుంటే పోలీసులు ఈ విధంగానే కాంగ్రెస్ ఏకపక్ష వ్యవహార శైలి మానుకోకుంటే ప్రజల తిరుగుబాటును ఎదుర్కోవాల్సి వస్తుందని కంచర్ల హెచ్చరించారు.