calender_icon.png 9 September, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగాన్ని పట్టించుకొని ప్రభుత్వం

08-09-2025 08:15:15 PM

జగిత్యాల అర్బన్,(విజయక్రాంతి): పెండింగ్ లో ఉన్న 8700 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో  స్థానిక కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని విద్యార్థులకు రావలసిన ఫీజులను 8700 కోట్లను పెండింగ్ లో పెట్టిందని, తద్వారా విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లాలంటే కళాశాల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని పేద బడుగు బలహీన దళిత గిరిజన విద్యార్థుల దగ్గరి నుండి ఫీజులు వసూలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్రపూరిత చర్య రేవంత్ సర్కార్ చేస్తుందని తెలియజేశారు. బడుగు బలహీన విద్యార్థులు విద్యావంతులై సమస్యల పట్ల నాణ్యమైన విద్య పట్ల అధికారులను ప్రశ్నిస్తారని ఎక్కడికక్కడ అణిచివేస్తూ విద్యారంగాన్ని అదో పాతాళానికి నెట్టివేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మొండి బకాయలను విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది అని అన్నారు.