calender_icon.png 9 September, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రిబుల్ ఆర్ లో భూములు కోల్పోతున్న రైతులకు అండగా నిలుస్తాం..

08-09-2025 08:38:04 PM

మునుగోడు,(విజయక్రాంతి): త్రిబుల్ ఆర్ లో భూములు కోల్పోతున్న రైతులకు అండగా నిలుస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సోమవారం మునుగోడు సిపిఐ కార్యాలయంలో జరిగిన మండల కౌన్సిల్ సమావేశంలో  పాల్గొని ప్రసంగించారు. త్రిబుల్ ఆర్ దక్షిణ భాగంలో చేపడుతున్న భూసేకరణలో దివిస్ కంపెనీ భూములను కాపాడే కుట్రలో భాగంగా పలుమార్లు అలైన్మెంట్లు మార్చారని ఆరోపించారు. దీని కారణంగా పచ్చని పంట పొలాలు వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూములు కోల్పోతున్న రైతుల పక్షాన ప్రభుత్వంతో కొట్లాడడానికి తాము సిద్దామని తెలిపారు.

పేద రైతులు భూమిని కోలిపోతున్న బాధ వర్ణనాతీతం అని అన్నారు. త్రిబుల్ ఆర్ లో భూములు కోల్పోతున్న రైతులకు బహిరంగ మార్కెట్ ధరకు అనుగుణంగా 10 రెట్ల ధరను  ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగావ్యాప్తంగా యూరియా  కొరత తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు.తెలంగాణ కు రావలసిన యూరియాను సరైన సమయంలో అందించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.తెలంగాణ రైతాంగం పట్ల బిజెపి మంత్రులకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు రైతులకు ఎలాంటి షరతులు లేకుండా యూరియాని అందించాలని సందర్భంగా డిమాండ్ చేశారు.

నల్గొండలో సురవరం సంస్మరణ సభ

నల్లగొండ పట్టణంలోని జిఎల్ గార్డెన్ లో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లగొండ మాజీ పార్లమెంట్ సభ్యులు సూరవరం సుధాకర్ రెడ్డి సమస్మరణ సభ ను జయప్రదం చేయాలని పార్టీ కార్యకర్తలు సానుభూతిపరులు మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సుధాకర్ రెడ్డి అంతర్జాతీయ దేశ రాజకీయాల్లో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలనుఈనెల 11 నుండి 17 వరకు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కోరారు.ఆనాటి నిజాం నిరంకుశ వెట్టిచాకిరి విముక్తి కొరకు దున్నేవాడికే భూమి దక్కాలని తలంపుతూ సాగిన సాయుధ పోరాటంలో అమరుల త్యాగాలను స్మరించుకొనుటకు కమ్యూనిస్టు కార్యకర్తలు సిద్ధం కావాలని అన్నారు.