calender_icon.png 17 January, 2026 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న సిరిసిల్ల జిల్లాను రద్దు చేస్తే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం

17-01-2026 03:07:15 PM

జిల్లా ఉద్యమకారుడు మారవేణి రంజిత్ కుమార్

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణం లో ప్రెస్ క్లబ్ లో జిల్లా ఉద్యమకారుడు మారవేణి రంజిత్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించి ఈ సందర్బంగా మాట్లాడుతు.. జిల్లా ఏర్పాటుతోనే అన్ని రంగాలల్లో ఈ మాత్రం అభివృద్ధి సాధ్యమైంది. అభివృద్ధి బాటలో నడుస్తున్న జిల్లాను రద్దు చేస్తే అభివృద్ధికి దూరం చేయడమే. రాజన్న సిరిసిల్ల జిల్లాను రద్దు చేస్తామంటే కాంగ్రెస్ పార్టీని జిల్లా నడి ఒడ్డున వంద గజాల గోతి తీసి పత్తిపెడుతాం. ఖబడ్దార్ జిల్లా ఏర్పాటు చేయాలనీ ఉద్యమం చేస్తే మద్దతు తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఎలా రద్దు చేయాలని కుట్ర చేస్తున్నాడు.

జిల్లాను రద్దు చేస్తే రానున్న మున్సిపాల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రజలు గుణపాఠం చెప్తారు. ఉద్యమల గడ్డ సిరిసిల్ల నుండి మరో పోరాటం తప్పదు, జిల్లాను రద్దు చేస్తే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రోడ్ల మీద తిరగలేరు జాగ్రత్త.రాజన్న సిరిసిల్ల జిల్లా కోసం అన్నాడు షాడో ముఖ్యమంత్రి మెడలు వంచి జిల్లా సాధించాం.ఎంతోమంది ఉద్యమ నాయకుల పైన కేసులు జైలు జీవితాలు గడిపాం. మళ్ళీ కేసులకైనా జైలు జీవితానికికైనా సిద్ధం ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలనే ఆలోచన ఉంటే వెంటనే విరమించుకోవాలి లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.