calender_icon.png 17 January, 2026 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలోనే బీఆర్ఎస్ భూస్థాపితం

17-01-2026 02:59:08 PM

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ

హైదరాబాద్: సికింద్రాబాద్ లో బీజేపీ విజయ సంకల్ప సమావేశం నిర్వహించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు(Telangana BJP President Ramchander Rao) అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా రామచందర్ రావు(Ramchander Rao) మాట్లాడుతూ... తెలంగాణలో బీజేపీకి బలం పెరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ త్వరలోనే భూస్థాపితం అవుతూందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు.