17-01-2026 02:46:11 PM
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో శనివారం ఉద్రికత్త నెలకొంది. మాజీ మంత్రి జోగురామన్నను(Jogu Ramanna) పోలీసులు గృహ నిర్భంధం చేశారు. చనాక-కోరటా బ్యారేజీ పంప్ హౌస్ శుద్ది కార్యక్రమానికి జోగురామన్న పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. జోగురామన్న ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. నిన్న చనాక- కొరటా బ్యారేజ్ పంప్ హౌస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రేవంత్ రెడ్డి చనాక-కొరాట ప్రాజెక్టును ప్రారంభించి మలినం చేశారని, ఆ మలినాన్ని పెన్‌గంగా నీళ్లతో పాలాభిషేకం చేసి శుద్ధి చేద్దామని జోగు రామన్న పేర్కొన్నారు.