17-01-2026 03:24:46 PM
మాల్దా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉత్తర బెంగాల్‌లోని మాల్దా టౌన్ స్టేషన్ నుండి హౌరా, గువాహటి (కామాఖ్య) మధ్య నడిచే దేశపు తొలి వందే భారత్ స్లీపర్ రైలును(Vande Bharat sleeper train) జెండా ఊపి ప్రారంభించారు. గౌహతి–హౌరా వందే భారత్ స్లీపర్ రైలును వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. మోదీ రైలు లోపల పిల్లలు, పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. ఆధునిక భారతదేశంలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడానికి అభివృద్ధి చేయబడిన పూర్తిగా ఏసీ వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణీకులకు తక్కువ ఛార్జీలతో ఎయిర్‌లైన్ లాంటి ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని పీఎంఓ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. తరువాత మాల్దాలో జరిగే ఒక బహిరంగ కార్యక్రమంలో, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో కనెక్టివిటీని బలోపేతం, అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఉద్దేశించిన, రూ. 3,250 కోట్ల విలువైన పలు రైలు, రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.