calender_icon.png 23 December, 2025 | 3:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహబూబ్‌నగర్‌లో ఏసీబీ సోదాలు

23-12-2025 01:16:50 PM

హైదరాబాద్: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(Telangana Anti-Corruption Department) మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఏసీబీ బృందాలు తెల్లవారుజామున ఆకస్మిక దాడులు చేసి, అధికారి కిషన్ నాయక్, అతని బంధువులు, స్నేహితులు, బినామీలుగా అనుమానిస్తున్న వారి ఇళ్లలో సోదాలు ప్రారంభించాయి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 12 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. డీటీసీ కిషన్, మరో నలుగురు అధికారుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. డీటీసీ కిషన్ కు భారీగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. కిషన్ కు నిజామాబాద్ లో రెండు భారీ భవనాలు, లగ్జరీ హోటల్, రాయల్ ఓక్ బిల్డింగ్ ఉన్నట్లు  ఉన్నట్లు అధికారులు గుర్తించారు.