09-08-2025 02:17:24 AM
- బదిలీల కోసం 15 ఏండ్లుగా ఎదురుచూపులు
- సర్వ శిక్ష అభియాన్‌లోఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టు ఉద్యోగులు
- దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించనట్లు ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు
- కామారెడ్డి జిల్లాలో సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు సమస్యలతో సతమతం బదిలీల కోసం వేచి చూస్తున్నా వైనం
కామారెడ్డి, ఆగస్టు 8 (విజయ క్రాంతి) , దేవుడు వరమిచ్చినా పూజారి కనీకరించినట్లు అనే సామెతలాగా సర్వ శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యో గుల పరిస్థితి నెలకొంది. గత 15 సంవత్సరాల క్రితం కాంట్రాక్టు ఉద్యోగులుగా చేరిన వారికి బదిలీలు లేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఉన్నతాధికారుల ఆలసత్వం వల్ల బదిలీలకు మోక్షం కలగడం లేదు.
దీంతో భార్యాభర్తలు పనిచేస్తున్న చోట ఒకరు ఒక జిల్లాలో మరొకరు మరో జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబాలకు దూరమై బతుకు బండిని సాగిస్తున్నారు. బదిలీలు జరుగుతాయని ఆశతో ఎదురుచూస్తున్నారు. వారి ఆశలు ఆవిరిగానే మిగులుతున్నాయి. భర్త ఒకచోట.. భార్య మరోచోట జీవనం సాగిస్తున్నారు. ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా సర్వ శిక్ష అభియాన్ లో 22 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో వివిధ స్థాయిలో 732 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వేతనం పై ఆధారపడి బతుకు బండి సాగిస్తున్న వీరికి సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్నందుకు శిక్ష తప్పడం లేదు.
ఏళ్ల తరబడి బదిలీలు లేవు
సర్వ శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు 15 సంవత్సరాలుగా బదిలీలకు నోచుకోలేదు. బదిలీలు చేపట్టాలని ఉన్నతాధికారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కలిసి వినతి పత్రాలను అందజేశారు. అయినా బదిలీలు మాత్రం జరగలేదు. భర్త ఒక జిల్లాలో పనిచేస్తే భార్య మరో జిల్లాలో పనిచేస్తున్నారు. ఒకే చోట పని చేద్దామని భావిస్తున్న వారికి బదిలీ లేకపోవడంతో పనిచేయకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తారని భయంతో విధులు నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. బదిలీలు చేయాలని ఉత్తర్వులు వచ్చిన ఉన్నతాధికారుల జాప్యం వల్ల కాంట్రాక్టు ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు. చాలీచాలని వేతనాలతో బ్రతికిడిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యో గులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఆ శాఖలో పనిచేసే ఉన్నతాధికారుల తప్పుడు నిర్ణయాల వల్ల ఉద్యో గులకు శాపంగా మారింది. ఇదంతా ఓకే అయితే ఉద్యోగ భద్రత సంగతి దేవుడు ఏరుగు. కనీసం బద్లీలైన చేయమని ప్రాధేయపడుతున్నారు.
బదిలీలకు ఉత్తర్వులు జారీ
విద్యశాఖ ముఖ్య అధికారి బదిలీలకు 11 మార్చి 20 25న ఉత్తర్వులు జారీ చేస్తే పాఠశాల స్థాయిలో పనిచేస్తున్న పార్ట్ టైం ఇన్స్టాక్టర్లు స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్ లు ఎమ్మార్పీ ఎంఆర్సి లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు ఎంఐఎస్ కోఆర్డినేటర్ జిల్లా ప్రాజెక్టు ఆఫీసులో ఇస్తాం అనా లిస్టులు ఏపీఓలకు బదిలీలకు ప్రత్యేకంగా బయలు పెట్టమని కోరారు. రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయ అధికారులు మాత్రం వచ్చే సంవత్సరం మే నెలలో జిల్లా, అంతర్ జిల్లా బదిలీలు చేస్తామనడం విడ్డూరంగా ఉంది.
బదిలీలు చేయడం వల్ల ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఎలాంటి ఆ సౌకర్యం ఏర్పడదు. విరందరూ కూడా విద్య ఏతార పనులు చేసేవారు. ప్రభుత్వం చేపడుతున్న ఉపాధ్యాయ ప్రమోషన్లలో బోధన అభ్యసన ప్రక్రియకు అటంకం కలిగనప్పుడు వీరికి ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని కొందరు విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మానవతా దృక్పథంతో ఉన్నతాధికారులు స్పందించి బదిలీల కు పచ్చ జెండా ఉపాలని సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు కోరుతున్నారు.
15 సంవత్సరాలుగా ఒకే చోట విధులు
కామారెడ్డి జిల్లాలోని క్లస్టర్ లో ఎంఆర్సిగా 15 సంవత్సరాలుగా ఒకే చోట పని చేస్తున్నాను. బదిలీ చేయాలని కోరుతున్న ఎవరికి బదిలీలు లేవు అని అధికారులు చెబుతున్నారు. దీంతో కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది.
నర్సిం లు, ఎం ఆర్ సి, జుక్కల్
భర్త ఒకచోట... తాను ఒక చోట విధులు
కంప్యూటర్ ఆపరేటర్ గా ఒకే చోట విధులు నిర్వహి స్తున్నాను. తన భర్త వేరే జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. తమకు ఇబ్బంది అవుతుంది. బదిలీలు చేపట్టాలని ఉన్నతాధికారులకు విన్నవించాం. బదిలీలు చేస్తామని చేయడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సర్వ శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న వారికి బదిలీలు చేపట్టాలి.
సంగీత, కంప్యూటర్ ఆపరేటర్, కామారెడ్డి జిల్లా,