calender_icon.png 1 September, 2025 | 9:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు కేరళకు సీఎం రేవంత్

31-08-2025 09:14:12 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) నేడు కేరళలో పర్యటించనున్నారు. ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత సభలో ప్రవేశపెట్టే బిల్లులపై చర్చలు  ప్రారంభిస్తారు. అనంతరం సీఎం 11 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కేరళకు వెళ్లనున్నారు. కేరళలోని అలెప్పి చేరుకుని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు అక్కడినుంచి హైదరాబాద్ చేరుకొని అసెంబ్లీకి వెళ్లనున్నారు. అసెంబ్లీలో పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చల్లో పాల్గొంటారు.