calender_icon.png 1 September, 2025 | 10:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ పార్టీ కోరుకున్నందునే సమర్థిస్తున్నాం: ఎమ్మెల్యే గంగుల

31-08-2025 10:14:28 AM

హైదరాబాద్: తెలంగాణ పురపాలక చట్టం 2019 నిబంధనలపై అసెంబ్లీలో చర్చ రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(BRS MLA Gangula Kamalakar) మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కోరుకున్నందునే సమర్థిస్తున్నామని.. డెడికేటెడ్ కమిషన్ వేయాలని సూచించినప్పుడు జీవో నెం.40 తీసుకువచ్చారని అన్నారు. మా సూచనలను విమర్శలుగా భావించొద్దని, అన్ని అధ్యాయనం చేశాకే తాము మాట్లాడుతున్నామని.. 42 శాతం రిజర్వేషన్లు మా పార్టీ సమర్థించిందని అన్నారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 కింద మాత్రమే డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పిందని అన్నారు. బీహార్ మధ్యప్రదేశ్ లో ఇదేవిధంగా బిల్లు తెస్తే కొట్టి వేశారని పేర్కొన్నారు. శాస్త్రీయ ప్రకారం చేస్తేనే బిల్లు నిలబడుతుందని.. పార్లమెంటులో బిల్లు పాస్ చేస్తేనే 42 శాతానికి ప్రొటెక్షన్ దొరుకుతుందని అన్నారు. నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఆక్ట్ 1952 కింద మాత్రమే డెడికేటెడ్ కమిషన్ వేయాలని తెలిపారు.