05-09-2025 01:20:13 PM
హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి(Khairatabad Ganesh)ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుక్రవారం దర్శించుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ సీఎంతో పాటు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్నారు. ఖైరతాబాద్ గణనాథునికి సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం గణేశ్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లను చేసిందని, ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలు 71 ఏళ్ల నుంచి జరుపుతున్నారని పేర్కొన్నారు. అటు, ఖైరతాబాద్ మహా గణపతి దర్శనాలు నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే.