05-09-2025 01:51:27 PM
చండూరు/మర్రిగూడ (విజయక్రాంతి): మర్రిగూడ మండల పరిధిలోని కుదబాక్ష పల్లి గ్రామానికి చెందిన మర్రిగూడ మాజీ ఎంపీపీ అనంతరాజు గౌడ్(Former MPP Anantharaju Goud) హైదరాబాదులోని మన్నెగూడలోని పగోడా ప్లాజా అసోసియేషన్ విగ్నేశ్వరుని లడ్డు ప్రసాదాన్ని రూ.4,11,116 వేల రూపాయలకు వేలం పాటలో పాల్గొని ఆయన కైవసం చేసుకున్నారు. లడ్డును కైవసం చేసుకున్న అనంతరాజును బ్రాహ్మణులు, కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ, వీరి కుటుంబానికి అన్ని విధాలుగా ఆ భగవంతుడు తోడుగా ఉండాలని, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వినాయకుని ప్రార్థిస్తూ ఆయనకు ఆ లడ్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.