05-09-2025 11:36:32 AM
మహబూబాబాద్,(విజయక్రాంతి): రేషన్ బియ్యం పంపిణీ(Distribution of ration rice) సందర్భంగా తమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావలసిన కమిషన్ బకాయి పేరుకుపోయిందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన కమిషన్ పెంపు, గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన రేషన్ షాపుల బందు(Ration shops closed) కార్యక్రమం మహబూబాబాద్ జిల్లాలో(Mahabubabad District) కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 558 రేషన్ షాపులు ఉండగా, అందులో 50 వరకు ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుండగా మిగిలిన 500 రేషన్ షాపులు రేషన్ డీలర్లు నిర్వహిస్తున్నారు.