calender_icon.png 5 September, 2025 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లడ్డూ వేలంలో అదృష్టవంతురాలైన మల్లికార్జున కాలనీ వాసులు

05-09-2025 12:17:43 PM

రామచంద్రపురం,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్(Ramachandrapuram Division) మల్లికార్జున నగర్ కాలనీలోని రుద్రసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల భాగంగా 9వ రోజు గణనాథుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డు వేలంపాటలో(laddu auction) భక్తులు విశేష ఉత్సాహం కనబరిచారు. మొదటి లడ్డు రూ.3 లక్షల 10 వేల రూపాయలకు రిషి దక్కించుకోగా, రెండవ లడ్డు రూ.2 లక్షల 20 వేల రూపాయలకు మల్లేశ్వరరావు సొంతం చేసుకున్నారు.

మూడవ లడ్డు రూ.1 లక్ష 60 వేల రూపాయలకు దుర్గ దక్కించుకున్నారు. మొత్తం మూడు లడ్డులు కలిపి రూ.6 లక్షల 90 వేల రూపాయలకు పలికాయి. నిర్వాహకులు మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా గణనాథుడి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, ప్రతి ఏడాది రికార్డు స్థాయిలో లడ్డులు భక్తులు దక్కించుకుంటున్నారని తెలిపారు. ఈ సంవత్సరం కూడా భక్తులు విశేషంగా పాల్గొని లడ్డులను సొంతం చేసుకోవడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు. ఉత్సవాలకు ధనరూపేణా, వస్తురూపేణా సహకరించిన ప్రతి ఒక్క భక్తుడికి, కాలనీవాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గణనాథుడి శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మహోత్సవాన్ని ఘనవంతం చేశారు.