05-09-2025 12:44:56 PM
అమీన్పూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ ఎక్స్ రోడ్ వద్ద శ్రీ వరసిద్ధి వినాయక గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్(Congress party incharge Kata Srinivas Goud) జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటాసుదా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు.
ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల పాల్గొనడం సంతోషంగా ఉందని గత 15 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈరోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దండు రమేష్ యాదవ్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఇలాగే ప్రతిఏటా గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని అలాగే నియోజకవర్గ ప్రజలను ఆ దేవదేవుడు గణనాథుడు అష్టైశ్వర్యాలను సుఖసంతోషాలను ఇచ్చేలా దీవెనలు ఇవ్వాలని ఈ కార్యక్రమంలో బొంతపల్లి చైర్మన్ ప్రతాపరెడ్డి బీరంగూడ దేవస్థాన చైర్మన్ సుధాకర్ యాదవ్ కార్పొరేటర్ పుష్ప నగేష్ రామ్ రెడ్డి శ్రీనివాస్ మల్లేష్ శ్రీనివాస్ యాదవ్ నిర్వాహకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు