calender_icon.png 19 July, 2025 | 1:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్లపై సీఎం స్పష్టతనివ్వాలి

19-07-2025 12:28:12 AM

సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ  

నల్లగొండ టౌన్ జులై18 (విజయక్రాంతి): కేంద్రంలో మంత్రులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో బనకచర్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చర్చలు జరిపారని కొన్ని నిర్ణయాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి రామానాయుడు ప్రకటన చేసిన నేపథ్యంలో అసలు చర్చలు జరిగాయా లేదా స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి  పై ఉందని వెంటనే ప్రజలకు స్పష్టతనివ్వాలని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు.

శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనకు ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని ఈ గందరగోళాన్ని తొలగించే విధంగా నిపుణులతో చర్చించి అఖిలపక్షంతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బనకచర్ల సమావేశం జరిగి ఉంటే ఆ సమావేంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి వరద, మిగులు జలాలపై స్పష్టమైన వాటాలను తేల్చాలన్నారు. 

కేంద్రలో ఉన్న బిజెపి రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తుందన్ని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపారు. అట్టి బిల్లును మూడు నెలలోపు తేల్చాలని సుప్రీం కోర్టు సైతం సూచించిందన్నారు. అయినప్పటికీ రాష్ట్రపతి గాని కేంద్రం గాని బిల్లును ఆమోదిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా స్పష్టతనివ్వలేదన్నారు. 

రాష్ట్రంలో బిసి రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఎలాంటి అడ్డంకులు ఆర్డినెన్స్ తీసుకొచ్చి చర్చలు చేపట్టాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకోసం జెఏసి ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగలు ఇస్తామని మేనిఫెస్టో ద్వారా ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ప్రకటన చేసిందన్నారు. జగిత్యాల జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న మల్లేశ్ అనే యువకుడిని యువతి బధువులు హత్య చేశారని ఇలాంటి ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయన్నారు. 

ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, నారి అయిలయ్య, డబ్బికార్ మల్లేష్, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, ప్రభావతి, వి.వెంకటేశ్వర్లు, ఎండి.హాశం, చిన్నపాక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.