calender_icon.png 19 July, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డుపై వరినాట్లు వేసి.. ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం..

19-07-2025 12:28:32 AM

రోడ్డు సమస్యను పరిష్కరించాలనీ రాయపోల్ గ్రామస్థుల వినూత్న నిరసన

ఇబ్రహీంపట్నం, జూలై 18: రోడ్డు సమస్యను పరిష్కరించాలనీ, గ్రామస్థులు రోడ్డుపై వరినాట్లు వేసి, ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేసి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం మండల పరిధి రాయపోల్ గ్రామంలోని ప్రధాన రోడ్డు గుంతలుగా మారి, కొద్దిపాటి వర్షానికే చెరువును తలపిస్తున్నాయి.

గ్రామస్థులు, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న తీరు మారకపోవడంతో శుక్రవారం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గోదల శేఖర్ రెడ్డి ఆధ్వ ర్యంలో గ్రామస్తులు వినూత్న నిరసనకు దిగారు. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రా మంలో గత ఐదు సంవత్సరాల నుండి గ్రామ ప్రధాన రహదారి గుంతలమయం కావడంతో ఈ ప్రధాన సమస్యను ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కి గత నెలక్రితం వినతి పత్రం ఇచ్చినా ఫలి తం లేదన్నారు.

అప్పుడు సానుకూలంగా స్పందించి 2, 3 రోజులలో సమస్యను పూర్తిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, కానీ నెల రోజులు పూర్తి కావస్తున్నా, సమస్య పరిష్కరం కాలేదని వా పోయారు. ఇప్పటికైనా ఈ రోడ్డు సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ విష్ణువర్ధన్ రెడ్డి, రమణారెడ్డి, సత్యనారాయణ జి, రావుల మల్లేష్, నరసింహ సత్యనారాయణ ప్రవీణ్ కార్తీక్ శివ శ్రీను చంటి విజయ్ నవీన్ భాస్కర్ నరేష్ శంకర్ పలువురుపాల్గొన్నారు.