calender_icon.png 19 July, 2025 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొర్రూరులో మెగా హెల్త్ క్యాంప్

19-07-2025 12:26:46 AM

తుర్కయంజాల్, జులై 18: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి తొర్రూరులోని వార్డు ఆఫీసులో పారిశుధ్య కార్మికులకు, స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. 100రోజుల ప్రణాళికలో భాగంగా మన్నెగూడలోని మహోనియా ఆస్పత్రి సౌజన్యంతో ఉచిత హెల్త్ చెకప్లు నిర్వహించారు. కంటి పరీక్షలు, రొమ్ము కేన్సర్ స్క్రీనింగ్, బీపీ, షుగర్, గైనకాలజీకి సంబంధించిన పరీక్షలు చేశారు.

అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిపై రిపోర్టు ఇవ్వడమే కాకుండా అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు మన పరిసరాల పరిశుభ్రతకు బలమైన మూలస్తంభంగా నిలుస్తున్నారని కొనియాడారు. నిత్యం మనచుట్టూ ఉన్న సముదాయాల శుభ్రత కోసం శ్రమిస్తున్నారని, వారి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆర్వో శ్రీనివాసులు, శానిటరీ ఇన్ స్పెక్టర్ వినయ్, ఎన్విరాన్ మెంట్ ఇంజినీర్ సురేష్, వార్డ్ అధికారులు రాకేష్, శేఖర్, రాణి, బిల్ కలెక్టర్లు అర్చన, మల్లేష్, నాగరాజు, జవాన్లు సుధాకర్, నాగేశ్, మురళి, అర్జున్, పాండు, డాక్టర్లు శిరీష, శృతి, తేజశ్రీ, రాఘవేందర్, వైద్య సిబ్బంది నర్సింహ, లక్ష్మీ నారాయణ తదితరులుపాల్గొన్నారు.