గ్రామ ప్రజల ఆరోగ్యమే మా ప్రాధాన్యత
సర్పంచ్ రామావత్ సేవ నాయక్
దేవరకొండ,(విజయక్రాంతి): గుర్రపు తండాలో ఉచిత మెగా వైద్య శిబిరం జైరామ్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించినట్లు సర్పంచి రామావత్ సేవా నాయక్ తెలిపారు శుక్రవారం గుర్రపుతండా గ్రామ కార్యాలయ ప్రాంగణంలో సర్పంచ్ రామావత్ సేవ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో సుమారు వంద మంది గ్రామస్థులు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. గ్రామస్తులకు షుగర్ టెస్ట్ మరియు బీపీ చెక్అప్ చేసిన అనంతరం ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సేవ నాయక్ మాట్లాడుతూ... పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని" కోరారు. ఈ శిబిరం ద్వారా ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే మా సంకల్పం" అని డాక్టర్ వి భరత్ సింగ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సభ్యులు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




