3 April, 2026 | 5:27 PM

గ్రామీణ క్రీడలకు వేదికగా జేపీఎల్

03-04-2026 03:44 PM

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండలం జంబుల్ దారి గ్రామపంచాయతీ పరిధిలోని లంజనివీర గ్రామంలో జంబుల్ దారి ప్రీమియర్ లీగ్ (జేపీఎల్) క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ఘనంగా ప్రారంభ మైంది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుర్నులే నారాయ ణ, జంబుల్ దారి ఉప సర్పంచ్ గుర్నులే విట్టల్ టాస్ వేసి పోటీలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గుర్నులే నారాయణ మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహిం చడం ఎంతో అవసరమని, తెలిపారు.

ఇలాంటి టోర్నమెంట్లు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు వారి ప్రతిభను వెలికితీయడా నికి వేదికగా నిలుస్తాయని అన్నారు. ఉప సర్పంచ్ గుర్ను లే విట్టల్ మాట్లాడుతూ... గ్రామ స్థాయిలో నిర్వహించే క్రీడా పోటీలు యువతను మంచి మార్గంలో నడిపిస్తాయని, చెడు అలవాట్లకు దూరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. క్రీడలతో పాటు విద్యలోనూ రాణించాలని యువతకు సూచించారు. టోర్నమెంట్‌లో వివిధ జట్లు పాల్గొనగా, ప్రారంభ మ్యాచ్‌లు ఉత్సాహభరితంగా సాగాయి. కార్యక్రమంలో నిర్వాహకులు, గ్రామ పెద్దలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.