17-08-2025 12:56:25 AM
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ జితేష్
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 16 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 21న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గ పరిధిలోని చండ్రుగొండ మండలం బెండ లపాడు గ్రామంలో ఇందిరమ్మ పిల్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఎస్పి రోహిత్ రాజ్ లతో కలిసి శనివారం జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమా వేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నా రు. సీఎం రేవంత్‌రెడ్డి చంద్రుగొండ మం డలంలోని బెండాలపాడు గ్రామంలో పర్యటించి, ఇంది రమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించనునున్నారు.
ఈ సందర్భంగా కలెక్ట ర్ మాట్లాడుతూ.. సీఎం పర్యటన విజయవంతంగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సభాస్థల నిర్మాణం, వేదిక రూపకల్పన, అతిథుల కూర్చునే సదుపాయాలు, పార్కింగ్ ఏర్పాట్లు, రవాణా, పారిశు ధ్యం, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ సరఫ రా, వైద్య శిబిరం, అగ్నిమాపక సిబ్బం ది, భద్రతా చర్యలు వంటి అంశాలను నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని సూచించారు.
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుం డా అన్ని శాఖల అధికారులు శ్రద్ధ వహించాలని కోరా రు. అనంతరం కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే కలిసి బెండాలపాడు, చంద్రుగొండ, దామరచర్ల, మద్దుకూరు గ్రామాలలోని సభాస్థలి, హెలిప్యాడ్, వాహనా ల పార్కింగ్ ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు.