08-08-2025 01:06:00 AM
మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి
మేడ్చల్, ఆగస్టు 7 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయ ని ధిని సద్వినియోగం చేసుకోవాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపద సమయంలో సీఎంఆర్ ఎఫ్ వరం లాంటిది అన్నారు.
ప్రభుత్వానికి సిఫారసు చేసి సీఎంఆర్‌ఎఫ్ మంజూరుకు కృషిచేసిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ నగర్ కార్పొరేటర్ మేకల సునీత, మాజీ కార్పొరేటర్ మురుగేష్, నాయకులు బద్దం పరశురాం రెడ్డి, జేఏసీ వెంకన్న, జీకే హనుమంతరావు, మేకల రాము యాదవ్, చిన్న యాదవ్, నవీన్ యాదవ్, అనిల్, డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, లక్ష్మణ్ యాదవ్, వెంకటేష్ యాదవ్, మధుసూదన్ రెడ్డి, శివ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, పవన్, రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.