calender_icon.png 8 August, 2025 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ ప్రభుత్వం విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్ చేసింది

08-08-2025 03:19:02 PM

ముగిసిన బండి సంజయ్ సిట్ విచారణ

రేవంత్ రెడ్డి, హరీశ్ రావు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) సిట్ విచారణ ముగిసింది. సిట్ అధికారులు బండి సంజయ్ స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. కాసేపటి క్రితమే దిల్ కుషా గెస్ట్ హౌస్ నుంచి బండి సంజయ్ బయలుదేరారు. బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంలో అత్యధికంగా నా ఫోన్ కాల్స్ ట్యాప్ చేశారు. మావోయిస్టులకు సబంధించిన ఫోన్లు ట్యాప్ చేయాలి.. మావోయిస్టుల జాబితాలో మా పేర్లు పెట్టి ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, హరీశ్ రావు ఫోన్లు కూడా ట్యాప్  చేశారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటిసారి వాంగ్మూలం ఇచ్చింది నేనే అన్నారు.

నావి, నా కుటుంబ సభ్యుల ఫోన్లు, నా పని మనుషుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు. చివరకు కేసీఆర్ కుమార్తె కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పారు. కేసీఆర్ కు బంధాలతో సంబంధం లేదు.. కుటుంబ సభ్యుల ఫోన్లే ట్యాప్ చేశారన్నారు. ట్యాపింగ్ వివరాలు తెలుసుకుని షాక్ కు గురయ్యానని బండి సంజయ్ పేర్కొన్నారు. కేసీఆర్ కుమార్తె, అల్లుడి ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసి విన్నారు. వారినీ విచారణకు పిలవాలని కోరారు. నా వద్ద ఉన్న ఆధారాలు, సమాచారం అధికారులకు ఇచ్చానని వివరించారు. కేసీఆర్ ప్రభుత్వంలో సాధారణ ఫోన్ కాల్స్ మాట్లాడే పరిస్థితి లేదు.. సాధారణ ఫోన్ కాల్స్ మాట్లాడేందుకు భయపడి వాట్సాప్ కాల్స్ మాట్లాడేదన్నారు.

మావోయిస్టుల కార్యకలాపాలు తెలుసుకోవడం ఎస్ఐబీ పని.. మావోయిస్టుల పేరుతో రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పారు. ఎస్ఐబీని సొంత అవసరాలకు అడ్డాగా కేటీఆర్ మార్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, లాయర్లు, వ్యాపారులు, సినీ నటులు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని వెల్లడించారు. గతంలో నేను గ్రూర్ 1 పేపర్లు లీక్ పై ధర్నాకు వెళ్తుండగా అరెస్ట్ చేశారు. నేను ధర్నాకు వెళ్లే విషయం ఎలా తెలిసిందంటే సమాధానం లేదన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు విచారిస్తున్న హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలిపారు. ఫోన్ల ట్యాప్ ద్వారా అనేక లావాదేవీలకు సంబంధించి లబ్ధి పొందారని చెప్పారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు బాగోతం చెబుతుంటే తనకే సిగ్గనిపించిందన్నారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావును సమాజం క్షమించదని సూచించారు.