calender_icon.png 8 August, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ కార్యక్రమాలు విద్యార్థులకు అందాలి

08-08-2025 01:06:51 AM

జిల్లా పరిశీలకులు శ్రీనివాస చారి

మంచిర్యాల, ఆగస్టు 7 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థుల సంక్షేమం కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతోందని, వాటిని విద్యార్థులకు సరైన సమ యంలో చేరవేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా పరిశీలకులు, తెలంగాణ మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివా స చారి పేర్కొన్నారు.

గురువారం జిల్లా కేం ద్రంలోని డీసీఈబీ కార్యాలయంలో డీఈఓ యాదయ్యతో కలిసి అన్ని మండలాల ఎం ఈఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఈఓ యాద య్య మాట్లాడుతూ ఎంఈఓలు రోజుకు రెండు పాఠశాలలు తప్పనిసరిగా సందర్శించాలని, నాణ్యమైన బోధన,

నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల విద్యాధికారులు, జిల్లా విద్యాశాఖ కార్యాలయ సూపరింటెండ్ సత్యనారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.