calender_icon.png 8 August, 2025 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీఐపీ తరహాలోనే జర్నలిస్టులకు నిమ్స్ లో వైద్య సేవలు

08-08-2025 02:49:17 PM

  1. విద్య, వైద్య విషయంలో ఎల్లపుడు జిల్లా నాయకత్వం అందుబాటులో ఉంటుంది.... 
  2. జర్నలిస్ట్ ఉచిత విద్య కోసం సర్క్యులర్ జారీ చేయించాం...జిల్లా అధ్యక్షుడు మాధవరావు
  3. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తో ప్రతి జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ .... నియోజకవర్గ అధ్యక్షుడు విజయ్ కుమార్
  4. వనపర్తి నియోజకవర్గ కార్యవర్గ సమావేశం...
  5. రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ 

శ్రీ రంగాపురం:  విద్య వైద్యం విషయం లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా రాష్ట్ర నాయకత్వం ఎల్లపుడు అందుబాటులో ఉంటుందని అందులో భాగంగానే రాష్ట్ర నాయకత్వం విఐపి తరహాలో అందించే వైద్య సేవలను జర్నలిస్టులకు(journalists) అందించేలా కృషి చేసిందని రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా శ్రీ రంగాపురం మండల(Srirangapuram Mandal) కేంద్రం లో ఏర్పాటు చేసిన వనపర్తి నియోజకవర్గ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరు అయ్యి మాట్లాడారు. ఈ సందర్బంగా రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ మాట్లాడుతు .....  జర్నలిస్టుల అభివృద్ధి కోసమే తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అనే యూనియన్ పుట్టింది. నియోజకవర్గం లో శ్రీ రంగాపురం మండలంలోని ప్రతి జర్నలిస్టులు అందరు కలిసి మెలిసి యూనియన్ బలోపేతం చేయడంతో పాటు వారికి కావాల్సిన హక్కులను సాధించుకుంటున్నారు చాలా సంతోషకరమైన విషయం.  అర్ధరాత్రి డబ్బుల కోసం వెళ్లే బ్యాచ్ వెంబడి వెళ్లకుండా ఫీల్డ్ వర్క్ చేసి నిజ నిజాలను రాయాలన్నారు.  కులాలకు మతాలకు యూనియన్ పని చేయదు జర్నలిస్టుల అభివృద్ధి కోసం పని చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల చివరి వారంలో జర్నలిస్టులకు శిక్షణ శిబిరాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. 

జర్నలిస్ట్ ఉచిత విద్య కోసం సర్క్యులర్ జారీ చేయించాం...జిల్లా అధ్యక్షుడు మాధవరావు 

జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య విషయంలో మే నెలలోనే జిల్లా విద్యాధికారి తో చర్చించి అన్ని మండలాల మండల విద్యాధికారి లకు సర్క్యులర్ పంపడం జరిగిందని జిల్లా అధ్యక్షుడు మాధవరావు అన్నారు. మీ మండల పాఠశాలలో జర్నలిస్ట్ ల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వకపోతే మండలాల  విద్యాధికారులను కలిసి ఫోన్ చేయించాలని అప్పటికి వినకపోతే జిల్లా కమిటీ దృష్టికి తీసుకుని రావాలన్నారు.  జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రి  మెరుగైన వైద్య సేవలను అందించెందుకు హెల్త్ కన్వీ నర్ కూడా నియమించడం జరిగిందని అర్థరాత్రి అపరాత్రి అయినా ఆపద వస్తే హెల్త్ కన్వీనర్ ఫోన్ చేస్తే మీకు అందుబాటులో ఉంది వైద్య సేవలను అందించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. వి ఐ పి తరహాలో అందించే వైద్య సేవలను నిమ్స్ ఆసుపత్రి లో జర్నలిస్టులకు అందించేందుకు రాష్ట్ర నాయకత్వం పని చేస్తుందని ఆయన గుర్తు చేశారు. 

ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తో ప్రతి జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్.... నియోజకవర్గ అధ్యక్షుడు విజయ్ కుమార్  

నియోజకవర్గ పరిధిలోని ప్రతి రిపోర్టర్స్ కు  హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తామని ఎమ్మెల్యే మేఘారెడ్డి చెప్పడం జరిగిందని అందుకు సంబందించిన పనులను సైతం ప్రారంభించడం జరిగిందని నియోజకవర్గ అధ్యక్షుడు విజయ్ కుమార్ అన్నారు.  విద్య, వైద్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా  నియోజకవర్గం, జిల్లా కమిటీ సభ్యులం ఎల్లపుడు అందుబాటులో ఉండడం జరుగుతుందని ఆయన వివరించారు. అంతకుముందు శ్రీ రంగాపురం మండల ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ.... పాఠశాలలో ఉచిత విద్య ను అందించేందుకు గతంలో జిల్లా విద్యాధికారి నుండి సర్క్యులర్ ఇవ్వడం జరిగింది కానీ కొన్ని పాఠశాలలో అనుమతి ఇవ్వడం లేదని ప్రత్యేక చొరవ తీసుకుని అన్ని పాఠశాలల్లో అయ్యే విధంగా చూడాలన్నారు.  మండలం లో ప్రెస్ క్లబ్ భవనం ఏర్పాటు కు కృషి చేయాలని గతంలో చాలా మందికి ప్లాట్స్ ఇవ్వడం జరిగింది మిగిలిన వారికీ సైతం ప్లాట్స్ అందించే విధంగా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, కోశాధికారి మన్యం,  తదితరులు పాల్గొన్నారు.