calender_icon.png 8 August, 2025 | 6:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈదుల వాగులో కొట్టుకపోయిన కారు

08-08-2025 02:25:49 PM

గ్రామస్తుల సహాయంతో సురక్షితంగా బయటపడిన నలుగురు

వలిగొండ,ఆగస్టు 8 (విజయక్రాంతి): వలిగొండ-చౌటుప్పల్ మండలాలకు చెందిన వర్కట్ పల్లి-నేలపట్ల గ్రామాల మధ్య గల ఈదుల వాగు(Edula Vagu) గురువారం సాయంత్రం నుండి కురిసిన వర్షాలకు ఉప్పొంగింది. వాగు పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో పాటు పెద్ద కొండూరు చెరువు భారీ ఎత్తున అలుగుపోవడంతో ఈదుల వాగు ప్రమాదకరంగా ప్రవహించింది. ఇది గమనించని రాత్రి అటుగా వెళుతున్న కారు లో ఉన్నవారు వాగులోకి వెళ్లడంతో కారు కొద్ది దూరం కొట్టుకుపోయి చెట్టుకు చిక్కుకుంది.

కాగా కారులో ఉన్న వారు వర్కుట్ పల్లి గ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదానికి గురికాగా వెంటనే వర్కట్పల్లి గ్రామానికి చెందిన తమ వారికి ఫోన్ లో సమాచారం అందించారు. సమీపంలో ఉన్న వర్కట్పల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున వాగు వద్దకు చేరుకొని తాళ్ల సహాయంతో కారులోని నలుగురు వ్యక్తులను రాత్రి 10 గంటలకు సురక్షితంగా బయటికి తీసుకోవచ్చారు. దీంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని గ్రామస్తులు కారులో ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రతి సంవత్సరం ఇదే ప్రాంతంలోని కాజ్ వే నుండి వరద నీరు భారీగా ప్రవహిస్తూ రాకపోకలకు ఇబ్బందులు అవుతున్నాయని దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి హై లెవెల్ వంతెన నిర్మించాలని వర్కట్ పల్లి,  నేలపట్ల గ్రామస్తులు కోరుతున్నారు.