12-08-2025 12:00:00 AM
బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్
ఆదిలాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి దత్తత జిల్లా ఆదిలాబాద్ జిల్లా పై సీఎం చిన్నచూపు చూడొద్దని, ఆదిలాబా ద్ జిల్లాకి మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు రూ.8 కోట్లు అందిస్తే, పక్కన ఉన్న నిర్మల్ జిల్లాకి రూ.22 కోట్లు అందించడం సమంజసం కాదన్నారు. ఇచ్చోడ మండలంలోని కామగిరి గ్రామంలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన మహిళ సమై ఖ్య భవనాన్ని ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభు త్వ హయాంలోనే మహిళకు అన్ని విధాలు గా అభివృద్ధి జరిగిందన్నారు. మహిళ సం ఘాలకు వడ్డీ లేని రుణాలు అందజేసి వారి కొరకు సమైఖ్య భవనాలను అందజేసింది కేసీఆర్ అని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.