calender_icon.png 12 August, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు ఆసరాగా నిలబడేలా పథకాలు అమలు

12-08-2025 12:00:00 AM

కల్యాణలక్ష్మి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే పాయల్ 

ఆదిలాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): ప్రభుత్వం ఏదైనా ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ పథకాలను అందించడం జరుగుతోందని  ఆదిలాబాద్ ఎమ్మెల్యే పా యల్ అన్నారు. ఇందులో భాగంగానే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. సోమవారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 132 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆడపిల్లల పెళ్లిళ్లు చేసిన కుటుంబానికి ఆర్థిక భారం నుండి కాస్త ఉపశమనం కలిగించేందుకు ఒక లక్ష  నగదు ఎంతో కొంత ఉపయోగపడుతోందని అన్నారు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరితగతిన చెక్కులు అందేలా అధికారులు సహకరించాలని కోరారు.

పేదవారు తమ ఆడపిల్లల పెళ్లిల్లు చేసేందుకు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఆర్డీవో స్రవంతి, అధికారులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు