12-08-2025 12:00:00 AM
ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో దేశభక్తిని చాటుదాం కార్యక్రమం
గద్వాల్ శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
గద్వాల, ఆగస్టు 11 : చదువుతో పాటు ప్రతి విద్యార్థి క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో నూ ప్రతిభ చూపుతూ, అన్ని విభాగాల్లో రా ణించాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్, గద్వాల్ శాసన సభ్యులు బండ్ల కృష్ణ మో హన్ రెడ్డి లు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బాలభవన్లో ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన దేశభక్తిని చా టుదాం కార్యక్రమంలో గద్వాల్ శాసన స భ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యా ర్థుల ప్రతిభను వెలికితీయడంలో ప్రజా నా ట్యమండలి చేపట్టిన ఈ కార్యక్రమం ఆదర్శనీయం అని పేర్కొన్నారు. సెల్ఫోన్ వాడకం లాభనష్టాలు,గ్రామీణ జీవనం,మాదకద్రవ్యాల నివారణ వంటి సమాజానికి అవసర మైన అంశాలపై పోటీలను నిర్వహించడం విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడంలో కీలకమని ఆయన అన్నారు.
బాలభ వన్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నేర్చుకొని వివిధ వేదికలపై ప్రదర్శనలు ఇ చ్చి గద్వాలకు పేరు తెస్తున్నారని వారు పేర్కొన్నారు. తాము ఎంత బిజీగా ఉన్నా కూడా విద్యార్థులతో సమయం గడిపేందుకు ఈ కార్యక్రమానికి వచ్చానని చెప్పారు.
ఈ సందర్భంగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ గెలుపొందిన విద్యార్థులకు బహుమతు లు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ నోడల్ అధికారి హృదయరాజ్, మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.