09-12-2025 02:18:06 AM
కౌర్‌ను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం
చండీగడ్, డిసెంబర్ 8: పంజాబ్ మాజీ ఎమ్మెల్యే, క్రికెటర్-, రాజకీయ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ చేసిన ఆరోపణ రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ‘రూ.500 కోట్ల పెట్టె’ ఇచ్చిన వారే సీఎం అవుతారంటూ ఆమె శనివారం మాట్లాడారు. ఈ తీవ్ర ఆరోపణపై ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు స్పం దించాయి. బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి తరుణ్ చుగ్ దీనిపై ఘాటుగా స్పం దించారు.
ముఖ్యమంత్రి పీఠానికి 500 కోట్ల ధర ఉందని సిద్ధూ భార్య చెప్పడం కాం గ్రెస్‌లో డబ్బు రాజకీయాలను బయటపెట్టిందని ఆయన ఆరోపించారు. ముఖ్యమం త్రి పదవిని ఒప్పందం ద్వారా కొనుగోలు చేయవచ్చని అంగీకరించడం కాంగ్రెస్‌లో నైతిక పతనాన్ని చూపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు ప్రజాస్వామ్య ప్రక్రియకు బదులుగా డబ్బుతో నడిచే వేలంపాట వ్యవస్థగా మారాయని చుగ్ విమర్శించారు.
ఆప్ పంజాబ్ ప్రధానకార్యదర్శి బల్తేజ్ పన్ను కూడా ఈ వ్యాఖ్యను తీవ్ర ఆందోళనకరంగా అభివర్ణించారు. నాయకత్వాన్ని ఎలా నిర్ణయిస్తారు? డబ్బు లావాదేవీల కోసం పంజాబ్ ప్రయోజనాలను ఎలా పక్కన పెడతారో ఈ వ్యాఖ్య బయటపెట్టిందని ఆయన అన్నారు. సిద్ధూను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినట్లయితేనే ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి తిరిగి వస్తారని కౌర్ సిద్ధూ చెప్పారు.
తమ వద్ద ఏ పార్టీకి ఇవ్వడానికి కూడా రూ.500 కోట్లు లేవని ఆమె స్పష్టం చేశారు. అయితే నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ మేరు పార్టీ అధికారిక లేఖను సోమవారం విడుదల చేసిందని ఆయన తెలిపారు.