calender_icon.png 22 May, 2025 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి చేయాలి

22-05-2025 12:00:00 AM

టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్ క్రాంతి వల్లూరు 

సంగారెడ్డి, మే 21(విజయక్రాంతి): ఈనెల 23న సీఎం పర్యటన ఏర్పాట్లను గురువారంలోగా పూర్తి చేయాలని టెలికాన్ఫరెన్స్ లో  జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. బుధవారం టెలి కాన్ఫరెన్స్ లో అధికారులతో మాట్లాడుతూ హెలిప్యాడ్ పనులు, ప్రజావేదిక సభ ఏర్పాటు ఎంతవరకు వచ్చాయో అని అడిగి తెలుసుకున్నారు.  హెలిపాడ్ నుండి సభాస్థలి వేదిక వరకు రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు.

వాహనాల పార్కింగ్ పనులు, రూట్ల వారీగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రణాళిక వివరాలు, గ్రీనరీ, స్టేజి ఏర్పాట్లు, స్టేజి అలంకరణ, పరిశుభ్రత, మిషన్ భగీరథ తాగునీరు, టాయిలెట్స్, సభకు హాజరయ్యే ప్రజలకు సదుపాయాలు అన్ని గురువారం నాటికి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ఆర్డీవోలు, జిల్లా అధికారులు;పాల్గొన్నారు.