calender_icon.png 22 May, 2025 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోడులో ముగిసిన వేసవి శిబిరం..

21-05-2025 10:53:48 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బోడు ఉన్నత పాఠశాలలో ఈ నెల 5 నుంచి విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులలో ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమ వివరములు.. ఉదయం 8 గంటలకు ప్రార్ధన, యోగ, టిఫిన్, భరత నాట్యం, దేశ భక్తి శీతల డాన్స్, చిత్రలేఖణం, ఆటలు, క్రామ్స్, చెస్, కోకో, కబడ్డీ పోటీలు నిర్వహించారు. పిల్లలు ఉత్సహంగా పాల్గొన్నారు. 120 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వాలీంటుర్లుగా, మాడే ప్రదీప్, (చిత్రలేఖరా), ఈశాల రవి, డ్యాన్స్ మాస్టర్ పండు, పోరుగంటి, వీరభద్రం, ఎంఈఓ జగన్ ఆధ్వర్యంలో జరిగాయని తెలిపారు.