7 May, 2026 | 2:20 AM

మధుయాష్కిగౌడ్‌కు సీఎం పరామర్శ

26-04-2024 02:07 AM

ఎల్బీనగర్, ఏప్రిల్ 25 : టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. మధుయాష్కిగౌడ్ మాతృమూర్తి అనసూయ మ్మ దశదినకర్మను గురువారం నిర్వహించ గా సీఎం రేవంత్‌రెడ్డి హయత్‌నగర్‌లో ఉన్న మధుయాష్కిగౌడ్ ఇంటికి వచ్చి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతికి గల కారణాలను తెలుసుకుని, అనసూయమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎంతోపాటు మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహదారుడు వేం నరేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.