కోల్ ఇండియా లాభం రూ. 8,682 కోట్లు
షేరుకు రూ.5 తుది డివిడెండు
న్యూఢిల్లీ, మే 2: ప్రభుత్వ రంగ బొగ్గు గనుల కంపెనీ కోల్ ఇండియా కన్సాలిడేటెడ్ నికరలాభం 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 26.2 శాతం వృద్ధిచెంది రూ.8,682 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ రూ.6,875 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది తాజాగా ముగిసిన క్యూ4లో కోల్ ఇండియా ఆదాయం మాత్రం ఏడాది క్రితంతో పోలిస్తే రూ. 40,371 కోట్ల నుంచి రూ.39,654 కోట్లకు తగ్గింది. 2023 పూర్తి ఆర్థిక సంవత్స రంలో కంపెనీ లాభం 17.8 శాతం పెరిగి రూ.37,369 కోట్లకు చేరింది. గురువారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ. 5 చొప్పున తుది డివిడెండను సిఫార్సుచేసింది. కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో షేర్‌హోల్డర్ల అనుమతికి లోబడి ఈ డివిడెండును చెల్లిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఇప్పటికే షేరుకు రూ.20.50 చొప్పున మధ్యంతర డివిడెండు ను చెల్లించింది. ముగిసిన ఆర్థిక సంవత్స రంలో బొగ్గు సరఫరాలు 8 శాతం పెరిగి 186.9 మిలియన్ టన్నులకు చేరడంతో భారీ లాభాల్ని కోల్ ఇండియా ఆర్జించ గలిగింది.






