calender_icon.png 4 September, 2025 | 3:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

01-09-2025 07:18:25 PM

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె  కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 99 ఫిర్యాదులు రాగా, అందులో జిల్లా అధికారులకు 30, రెవెన్యూ శాఖకు 69 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. వీధి కుక్కల సమస్య ఎక్కువగా ఉన్నందున వీధి కుక్కలపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని  చెప్పారు.

ఎంపీడీవోలు వెంటనే పంచాయతీ కార్యదర్శులతో ఈ విషయంపై సమావేశం నిర్వహించాలన్నారు. ప్రత్యేక అధికారులు హాస్టళ్లు, పాఠశాలలు తనిఖీ చేయాలని చెప్పారు. దర్తి ఆబా జనజాతీయ యోజన తదితర పథకాల కింద చేపట్టిన యూనిట్ల గ్రౌండింగ్ తదితర అంశాలను కలెక్టర్ సమీక్షించారు. ప్రత్యేక అధికారులు మండలాలను సందర్శించినప్పుడు ఏదైనా చిన్న చిన్న పనులు మంజూరు చేయవలసి వస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్పెషల్ కలెక్టర్ సీతారామ రావు, గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్ , ఆర్డీవోలు, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.