05-10-2025 12:52:41 PM
ములుగు: జిల్లాలో స్థానిక కాంగ్రెస్ నాయకుల అండతో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. కాంగ్రెస్ నాయకుల అండతో 1000 మంది సభ్యులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి దర్జాగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో కోడి పందాల మీద నిషేధం ఉండడంతో నిర్వాహకులు బెట్టింగ్ రాయుళ్లని ప్రత్యేక వాహనాల్లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి తరలిస్తున్నారు. రూ.200 ఎంట్రీ టికెట్ తీసుకుంటేనే పందాలకు ప్రవేశమని, కేబుల్ కటింగ్ పేరుతో బెట్టింగ్ వేసే వారి దగ్గర వాటాలను కట్ చేస్తున్నట్టు సమాచారం.
బుధవారం, శుక్రవారం, ఆదివారం మూడు రోజుల్లో కోడి పందాలు నిర్వహించి, ఒక్క రోజుకు దాదాపు రూ.50 లక్షలు బెట్టింగ్ జరుగుతుందని స్థానికుల ఆరోపిస్తున్నారు. ఈ పందాలు వేసే వారిలో ఎక్కువగా కూలి పని చేసే వారే ఉన్నారని, కష్టపడి సంపాందించి డబ్బు అంత పందాల్లో పోగొడుతున్నారని బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏమీ తెలియనట్లు నటిస్తున్నారని మండిపడుతున్నారు.