calender_icon.png 5 October, 2025 | 1:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ ను విడనున్న సూదగోని దంపతులు?

05-10-2025 11:32:06 AM

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ రేకుర్తి పరిధిలోని 18వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ సూదగోని మాధవి కృష్ణ గౌడ్ దంపతులు బీఆర్ఎస్ పార్టీని  వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. డివిజన్ కు చెందిన ఒక బి ఆర్ ఎస్ నాయకుడు గతంలో ఎమ్మెల్యే గంగుల వద్ద పిఏగా పని చేసి ప్రస్తుతం మంత్రి పొన్నం కు అనుచరుడిగా ఉన్న ఒక నాయకుడు కలసి పలు అంశాలలో అడ్డు తగులు తుండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. దీనికి తోడు ఆదివారం తెల్లవారు జామున జరిగిన దుర్గా మాత నిమజ్జనం సందర్బంగా వారి తీరుపై ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది.

ప్రతి ఏటా మత సామరస్యానికి చిహ్నంగా హిందు, ముస్లింలు దేవి నవరాత్రి ఉచ్ఛవాల్లో కలిసి పాల్గొంటారు. అదే విధంగా ఆదివారం నిమజ్జనం సందర్బంగా నిర్వహించే భరత్ లో ముస్లిం యువత పాల్గొనంగా వారు ఒకరిపై దాడి చేశారని పోలీస్ లకు ఫిర్యాదు చేయడంపై సూదగోని దంపతులు తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలిసింది. ఈ వరస సంఘటనలతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మాజీ మేయర్ సునీల్ రావు కు వీరు ముక్ష అనుచరులుగా ఉండే వారు, అయితే సునీల్ రావు బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన సందర్భంలో సూదగోని దంపతుల పార్టీవని వీడలేదు. ప్రస్తుతం వీరు బీజేపీ గూటికి చేరుతారా లేక అధికార కాంగ్రెస్ లో  చేరుతారా చూడాలి. వీరితో ఇప్పటికే కాంగ్రెస్ పార్లమెంటరీ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు టచ్ లో ఉన్నారు.