26-07-2025 12:17:23 AM
జైపూర్, జూలై 25: రాజస్థాన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఝాలవర్ జిల్లా మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం పైకప్పు ఒక్కసారిగా కూలింది. ఈ ఘటనలో ఇప్ప టివరకు ఏడుగురు మృతి చెందగా.. మరో 40 మంది విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమా చారం అందుకున్న అధికారులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింది చిక్కుకున్న వారిని రక్షించేందుకు యత్నిస్తున్నారు.
సహాయక చర్యలు కొనసా గుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవ కాశముంది. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా ప్రమాదంపై రాష్ట్ర వి ద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ స్పందించారు. ఈ విషాద ఘటన త నను ఎంతో బాధించిందన్నారు. భవనం పైకప్పు ఎలా కూలిపోయిందనే దానిపై విచారణ కొనసాగు తుందన్నారు.