calender_icon.png 27 July, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెప్టెంబర్‌లో పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తాం

26-07-2025 12:15:35 AM

  1. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్
  2. పాలస్తీనాను దేశంగా గుర్తించిన తొలి జీ-7 దేశంగా ఫ్రాన్స్
  3. మేక్రాన్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన నెతన్యాహూ, అమెరికా

పారిస్, జూలై 25: రానున్న సెప్టెంబర్‌లో పాలస్తీనాను తాము దేశంగా గుర్తించనున్నట్టు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్ గురువారం ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సహా అమెరికా తీవ్రం గా వ్యతిరేకిస్తోంది. అమెరికా రక్షణశాఖ మం త్రి మార్కొ రుబియో ఇది నిర్లక్ష్యపూరిత నిర్ణ యం అని కేవలం హమాస్ ప్రొపగాండ అ మలు చేసేందుకే ఈ నిర్ణయం అన్నారు.

పాలస్తీనాను దేశంగా గుర్తించిన తొలి జీ-7 దేశంగా ఫ్రాన్స్ నిలవనుంది. న్యూయార్క్‌లో సెప్టెంబర్‌లో జరగబోయే  ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఈ ఆంశంపై అధికారిక ప్రకటన చేస్తామని మేక్రాన్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘గాజాలో సాధారణ పౌ రులకు తక్షణం రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది.

శాంతిని నెలకొల్పడం సాధ్య మే. తక్షణమే ఇరు దేశాలు కాల్పుల విరమ ణ పాటించాలి. బందీలందరినీ విడుదల చే యాలి’ అని ఆ పోస్టులో తెలిపారు. కాగా మే క్రాన్ నిర్ణయాన్ని పాలస్తీనా అధికారులు స్వా గతించారు. 2023 అక్టోబర్ 7 హమాస్ దా డి తర్వాత ఉగ్రవాదానికి దక్కిన బహుమతి అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు.