calender_icon.png 28 July, 2025 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్లపై గుంతలు పూడ్చాలని బిఆర్ఎస్ రాస్తారోకో

28-07-2025 02:28:39 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో ప్రధాన రహదారిపై అనేకచోట్ల గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిందని, వెంటనే రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడ్చి రోడ్లకు మరమ్మత్తులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు సోమవారం అంబేద్కర్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ... కేసముద్రం మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తున్నామని ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారని, రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని, అడుగుకో గుంట ఏర్పడి వాహనాల రాకపోకలకు ఆటంకంగా మారిందని ఆరోపించారు. రోడ్లపై ఏర్పడ్డ గుంటలను వెంటనే పూడ్చి, మెరుగైన రోడ్డు నిర్మించి ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు.