18 August, 2026 | 12:58 AM

46 యూనిట్ల రక్తం సేకరణ..

18-08-2026 12:29 AM

అలంపూర్, ఆగస్టు 17: ఈ నెల 22న  మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని ముందస్తుగా కొత్త రాజోలి మండల చిరంజీవి అభిమానులు సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు పింజరి పూల హుస్సేన్, ఉపాధ్యక్షుడు మహబూబ్ బాషా, మండల సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన శిబిరంలో గ్రామ ప్రజలు,

యువత, మహిళలు, అభిమానులు పాల్గొని 46 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు.ఈ సందర్భంగా అఖిలపక్ష కమిటీ సభ్యులు మాట్లాడుతూ రక్తదానం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని, యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు.తహసీల్దార్ రామ్మోహన్ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు.