calender_icon.png 21 November, 2025 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామూహిక వందేమాతర గీతాలాపణ

21-11-2025 06:52:14 PM

మందమర్రి,(విజయక్రాంతి): వందేమాతరం గేయాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సామూహిక వందేమాతర గీతాన్ని ఆలపించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని ఆదిల్ పేట్ చౌరస్తాలో శుక్రవారం బిజెపి ఆధ్వర్యంలో గ్రామస్థులు, విద్యార్థులతో సామూహిక వందేమాతరం గీతాలపన నిర్వహించారు. ఈ సందర్భం గా బీజేపీ నాయకులు డివి దీక్షితులు, దేవరనేని సంజీవరావులు మాట్లాడారు. స్వాతంత్య్ర సంగ్రామంలో వందేమాతర నినాదం ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చిందని, బ్రిటిష్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిందని వారు అన్నారు. ప్రతి ఒక్కరూ వందేమాతర గీతాన్ని గుండెల్లో నింపుకుని దేశ పురోభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని వారు కోరారు.