calender_icon.png 21 November, 2025 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నార్కట్‌పల్లి అద్దంకి రోడ్డులోని బ్లాక్‌స్పాట్‌లను సందర్శించిన జిల్లా ఎస్పీ

21-11-2025 07:02:50 PM

మిర్యాలగూడ,(విజయక్రాంతి): ప్రమాదాల నివారణ, రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ అన్ని శాఖల సమన్వయంతో ఎప్పటికప్పుడు ప్రమాదాల నివారణ చర్యలకై పనిచేస్తుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. జిల్లాలో నార్కట్పల్లి అద్దంకి నామ్ రోడ్డు (ఎస్హెచ్-2) రాష్ట్ర రహదారిపై  ప్రమాదాలు జరిగే ప్రాంతాలు (బ్లాక్ స్పాట్)లను ఆర్&బి శాఖ, ఎక్సైజ్,ఆర్టీవో,హైవే ఇంజనీర్  అధికారులు వీరితో పాటు గ్రామ రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యుల సమన్వయంతో కలిసి మిర్యాలగూడ టూ టౌన్ పరిధిలోని నందిపాడు ఎక్స్ రోడ్డు, వన్ టౌన్ పరిధిలోని ఈదులగూడ ఎక్స్ రోడ్డు, మిర్యాలగూడ రూరల్ పరిధిలోని గూడూరు ఎక్స్ రోడ్డు, దామచర్ల వద్ద బ్లాక్ స్పాట్ ను శుక్రవారం సందర్శించారు.

ప్రమాదాలు జరగడానికి గల కారణాలు, ప్రమాదాల నివారణ చర్యలు, తదితర అంశాలపై అధికారులతో చర్చించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ.నందిపాడు,ఈదులగూడ ఎక్స్ రోడ్డుల వద్ద స్పీడ్ బ్రేకర్లు, లైటింగ్, రంబుల్ స్టిక్స్ వేగ నియంత్రణ సూచికలు రాంగ్ రూట్ లో వాహనాలు రాకుండా నివారణ చర్యలు  తీసుకోవాలని తెలిపారు. గూడూరు ఎక్స్ రోడ్డు వద్ద అదిక ప్రమాదాలు జరుగుతున్నందున ప్రస్తుతం ఉన్న మీడియన్ ఓపెనింగ్ మూసివేసి మిర్యాలగూడ, వాడపల్లి వెళ్లే రోడ్డు మార్గాన్ని ఓపెన్ చేయాలనీ అలాగే పాదాచారులకు అటు ఇటు వెళ్లే క్రమంలో  ప్రమాదాలు జరుగకుండా మెటల్ బీమ్ క్రాస్ బ్యారియర్ ని అమర్చాలన్నారు.

దామరచర్ల వద్ద సిమెంట్ ఫ్యాక్టరీలు అధికంగా ఉండడం వల్ల ప్రజలు,కార్మికులు వాహనదారులు రోడ్డు దాటే క్రమంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున మధ్యలో మెటల్ బీమ్ క్రాస్ బ్యారియర్ ఏర్పాటు చేయాలని, లైటింగ్, రాంగ్ రూట్ లో వాహనాలు రాకుండా రంబుల్ స్టిక్స్ వేగ నియంత్రణ సూచికలు అధికారులకు సూచనలు ఇచ్చారు. అలాగే అన్ని జంక్షన్ ల వద్ద హై మాక్స్ లైట్స్,సెంట్రల్ లైటింగ్,బ్లింకర్స్,జీబ్రా క్రాసింగ్ లైన్స్, రంబుల్ స్టిక్స్, మొదలగు వేగ నియంత్రణ సూచికలు వెంటనే పెట్టే విధంగా అధికారులకు ఆదేశించారు. ఆయా గ్రామాల సంబందించి రోడ్డు సేఫ్టీ కమిటీ వారితో మాట్లాడి ప్రమాదాల కారణాలు  తెలుసుకున్నామన్నారు.

జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్ లు గతంలో 58 ఉండగా ప్రస్తుతం 41 కి తగ్గించడం జరిగిందని, రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివరించారు. రాత్రి సమయంలో రహదారిపై వాహనాలు నిలిపి ఉండడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ రోడ్డుపై ఎలాంటి వాహనాలు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నమని అన్నారు. (మిషన్ RRR) రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా హైవే వెంట ఉన్న గ్రామ  ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కల్పించి రోడ్డు భద్రత పట్ల చైతన్య పరుస్తున్నామని అన్నారు. రోడ్డు ప్రమాదాలపైన ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటామని, వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని కోరారు.

అలాగే జిల్లా పరిధిలో శీతాకాలం తీవ్రత, ఉదయం మరియు రాత్రి వేళల్లో పొగమంచు ఎక్కువగా ఉండడం వల్ల రహదారులపై ముందున్న వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో ప్రమాదాలు నివారించేందుకు అన్ని వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్  పలు చూచనలు సూచించారు. ఎస్పీ గారి వెంట మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర రాజు, సీఐలు పీఎన్డీ ప్రసాద్, నాగభూషణ్, యస్.ఐలు రాంబాబు, శ్రీనివాస్, లక్ష్మయ్య, శ్రీకాంత్ రెడ్డి, డీటీఆర్పీ రిటైర్ సీఐ అంజయ్య, తదితర రోడ్డు సేఫ్టీ ఇంజనీర్లు ఉన్నారు.