calender_icon.png 1 May, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు

29-04-2025 12:00:00 AM

మంచిర్యాల, ఏప్రిల్ 28 (విజయక్రాంతి):జిల్లాలోని ప్రభుత్వ బిసి బాలుర కళాశాల వసతి గృహం, ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో ఉండి చదువుకొని ఇంటర్మీడియట్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సోమవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అభినందించారు.

గురుండ్ల రవీందర్, ఎన్ అభినయలకు కలెక్టర్ చేతుల మీదుగా  మెమొంటో ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్, ఎస్సీ కార్పొరేషన్ డీడీ దుర్గాప్రసాద్, వసతి గృహ సంక్షేమ అధికారులు మోసీన్  అహ్మద్, సుధా లక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.