27-11-2025 12:00:00 AM
పార్టీలకతీతంగా సర్పంచ్‌ని ఎన్నుకున్న గ్రామస్థులు
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 26 (విజయక్రాంతి): రుద్రంగి మండలంలోని రూప్లా నాయక్ తండా పంచాయతీలో సర్పంచ్గా జవహర్ లాల్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీలకతీతంగా గ్రామ ప్రజలు ఏకమై ఆయనను ఎన్నుకున్నారు. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో తన వంతు కృషి చేస్తానని సర్పంచ్ జవహర్ లాల్ నాయక్ తెలిపారు.జిల్లాలో తొలి ఏకగ్రీవ పంచాయతీగా రూప్లా నాయక్ తండా నిలిచింది. ఇదే తరహాలో మరికొన్ని తాండాలు కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.