calender_icon.png 21 October, 2025 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురండి.. మద్దతు ధర పొందండి

21-10-2025 02:06:26 PM

వలిగొండ,(విజయక్రాంతి): రైతులు తాము పండించిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం వలిగొండ మండలంలోని మాందాపురం, నాతాళ్ల గూడెం గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతాయని మధ్య దళారులకు అన్ని మోసపోవద్దని అన్నారు.

రైతులు తమ ధాన్యాన్ని 17% తేమ ఉండేలా తాలు, మట్టి లేకుండా చూసుకోవాలని ఏఈవోలు నాణ్యత ప్రమాణాలు పాటిస్తే మిల్లర్లు ఇబ్బంది పెట్టారని అన్నారు. రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలైన టెంట్, వాటర్ సౌకర్యాన్ని కల్పించాలని అన్నారు. రానున్న రోజులలో ప్రభుత్వ స్థలాలు గుర్తించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతులు విశ్రాంతి తీసుకునేందుకు భవనాలు నిర్మించేందుకై ప్రభుత్వానికి సిఫారసులు పంపించడం జరిగిందని జిల్లాలో 98 ప్రభుత్వ కేంద్రాలు ఉన్నాయని అన్నారు.

రైతులు తమ ధాన్యం తడవకుండా కాపాడుకుంటున్నారని కానీ రైతులు కూడా తడవకుండా ఉండేందుకు రైతుల కోసం విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. కొనుగోలు ప్రారంభమైన వెంటనే మిల్లర్లు ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తీసుకునేందుకు సహకరిస్తామని తెలియజేయడం జరిగిందని హమాలీలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగిందని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దశరథ, ఏఈఓ అంజనీ దేవి, ఎంఆర్ఐ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.