21-10-2025 05:29:05 PM
కలెక్టర్ హనుమంతరావు..
వలిగొండ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం వలిగొండ మండలంలోని మాందాపూర్ గ్రామంలో ఇందిరమ్మ నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని సకాలంలో లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దశరథ, ఎంఆర్ఐ కరుణాకర్ రెడ్డి, పంచాయితీ కార్యదర్శులు నవీన్ రెడ్డి, లింగస్వామి పాల్గొన్నారు.